వింజమూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఎవరు ఆపలేరు అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును దేశమంతా వ్యతిరేకిస్తుందని చెప్పారు.