మొబైల్ హంట్ ద్వారా పోగొట్టుకున్న రూ. 1. 50 కోట్ల విలువ చేసే 602 మొబైల్స్ ను పోలీసు అధికారులు రికవరీ చేశారు. మంగళవారం నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో బాధితులకు వారి ఫోన్లను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి ప్రజలకు అందించాలన్న సంకల్పంతో మొబైల్ హాంట్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఫోన్ పోగొట్టుకున్న వారు 9154305600 ను వినియోగించుకోవాలన్నారు.