కొరిసపాడు మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన రావి శ్రీధర్ మండలంలోని నాయకులతో బుధవారం అద్దంకి వైయస్సార్ పార్టీ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్యను ఒంగోలులో కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరిని కలుపుకొని వైయస్సార్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని శ్రీధర్ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ కు కృష్ణ చైతన్య శుభాకాంక్షలు తెలియజేశారు.