టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీసత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జీ బి. కె. పార్థసారథి ఆదేశాల మేరకు టీడీపీ అనుబంధ సంఘాలు తెలుగు రైతు, బిసి కమిటీల ఆధ్వర్యంలో పెనుకొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సామూహిక రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగు రైతులు, బిసి కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.