ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా కూతురుపై ఏడేళ్ల బాలుడి అత్యాచారం... తల్లి ఆరోపణ

national |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 09:51 PM

తన ఐదేళ్ల కూతురిని పొరుగున ఉండే ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేశాడంటూ ఉత్తరప్రదేశ్‌‌లో ఓ మహిళ ఆరోపించింది. కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆదివారం రాత్రి తన బిడ్డ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దారుణం జరిగింది. ఘటనపై బాలిక తల్లి అక్బర్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. పిల్లలిద్దరికీ జిల్లా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఐపీసీ‌లోని సెక్షన్ 82 ప్రకారం ఏడేళ్లలోపు చిన్నారులు చేసే ఏ చర్యను నేరంగా పరిగణించరాదు. దీంతో, ఈ కేసు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో న్యాయనిపుణుల సలహా ఆధారంగా ముందుకెళతామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com