దళితులను ఎ , బి, సి , డి వర్గాలుగా విభజించాలనీ యువసేన సేవా సంఘం ముక్యులు లింగాల అప్పారావు, లింగాల భాస్కరరావు, జంగం శ్రీనివాస రావు, నగర మహేష్ , డిమండు చేసారు. బుధవారం విజయనగరం జిల్లా కార్యాలయం వద్ధ నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యువసేన సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ కులాల్లో 59 ఉపకులాలు ఉన్నాయని, వర్గాలుగా విభజించకపోవడం వల్ల నేటికి అనేక ఉపకులాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు.