కర్నూలు, నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఉన్న దివ్య బార్ అండ్ రెస్టారెంటు బార్ యజమాని శివలింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసింహులు, డేవిడ్, శంకర్‌గౌడు, రాజశేఖర్లపై కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. రెండు వర్గాల మధ్య బార్ ఉన్న స్థలంపై కోర్టులో సివిల్ తగాదా ఉంది. అయితే ఈ కేసులో కోర్టు శివలింగారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నిందితులు నలుగురు బార్‌పై దాడి చేసి రూ.15 లక్షలు విలువైన సామగ్రిని ధ్వంసం చేసినట్లు బాధి తుడు ఫిర్యాదు చేశారు.