విజయనగరం జిల్లా, బొబ్బిలి: నేరెళ్ళ వలస గిరి శిఖర ప్రాంతానికి చెందిన బోయిన పైడితల్లి(60) ప్రమాద వశాత్తూ కొండ పై నుంచి జారిపడి గాయాల పాలయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. మృతురాలు పైడితల్లి భర్త ఎఱ్ఱపు దొర తో కలిసి ఈ నెల 8న వివాహ కార్యక్రమం నిమిత్తం జీలుగు వలస వెళ్లారన్నారు. 9వ తేదీన ఇంటికి బయలుదేరే క్రమంలో కొండ నుంచి సుమారు 50 మీటర్ల కిందకు జారిపడి గాయాలు తగిలి చనిపోయినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa