చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని.. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే నినాదంతో అసెంబ్లీకి వెళ్లామని చెప్పారు. 'ఇవాళ అసెంబ్లీకి ఒక దుర్దినం. 200 మంది మార్షల్స్‌ను పెట్టి సభ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. స్పీకర్ తీరు చాలా దారుణంగా ఉంది' అని అన్నారు.