మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. మహిళా బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. రాజ్యసభ, శాసనమండలిలోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. అలాగే సెప్టెంబర్‌ను మహిళా చరిత్ర నెలగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏపీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో 50 శాతం మంది మహిళలకే కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.