తిరునెల్వేలి-చెన్నై వందే భారత్ రైలు సర్వీసు సెప్టెంబర్ 24న ప్రారంభం కానుంది. ఈ రైలును న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రైలు తిరునెల్వేలి నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి 1.50 గంటలకు చెన్నై చేరుకునే అవకాశం ఉంది. తిరిగి చెన్నై నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి 10.40 గంటలకు తిరునెల్వేలి చేరుకుంటుంది. హాల్ట్లు, ఛార్జీల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.