బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదుల గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షలు ఇస్తామని NIA రివార్డును ప్రకటించింది. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాది హర్విందర్ సింగ్ సంధు, లఖ్‌బీర్ సింగ్ సంధుల గురించి సమాచారం కోసం ఇవ్వాలని కోరింది. నిషేధిత సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)తో వీరికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.