మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఓంకారేశ్వర్ లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి ‘ఏకాత్మాకి ప్రతిమ’ లేదా ‘స్టాచ్యూ ఆఫ్ వన్ నెస్’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఖాండ్వా జిల్లాలోని నర్మదా నదికి అభిముఖంగా సుందర మాంధాత కొండపై దీన్ని నిర్మించారు. ఈ నెల 18నే దీన్ని ఆవిష్కరించాల్సి ఉండగా వర్షాల కారణంగా ఆలస్యంగా ఆవిష్కరించారు.