ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించని మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపే వారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంట్ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం గరిష్టంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. హిజాబ్ ధరించని మహిళలకు సేవలందించే వ్యాపారులకు సైతం ఈ చట్టం వర్తిస్తుంది. ఈ బిల్లు రాజ్యాంగ పరిరక్షకులుగా పని చేసే మతాధికార సంస్థ గార్డియన్ కౌన్సిల్ అంగీకారం తెలపాల్సి ఉంది.