ఓటరు నమోదుకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఓటరుగా నమోదు కావడానికి ఉపయోగించే ఫారం-6, ఫారం-6బీల్లోని కాలమ్స్ లో ఆధార్ సంఖ్య అడగడానికి కారణం కేవలం ఆ వ్యక్తి గుర్తింపు వివరాలను ధ్రువీకరించుకోవడం కోసం మాత్రమేనని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరణను త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలిపింది. దీనిపై వేసిన పిటిషన్ సందర్భంగా ఈసీ వివరాలు తెలిపింది.