ఒడిశాలోని రౌర్కెలా అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేస్తున్న సస్మిత మింజ్ (35) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ నెల 15న విధులకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఈ నెల 17న ఆమె ఓ హోటల్ లో ఉన్నట్లు తెలిసి తల్లి, సోదరుడు కలిసేందుకు యత్నించగా, తనకు విశ్రాంతి కావాలని కలిసేందుకు నిరాకరించారు. తర్వాత 2 రోజులకు ఆమె మృతదేహం పట్టణంలోని జలాశయంలో లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.