ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇదే నీకు సరైన సమయం బాలయ్య, పోయిన పగ్గాలు తీసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 12:00 PM

 బావ చంద్ర‌బాబు జైల్లో.. అల్లుడు నారా లోకేష్‌ ఢిల్లీలో ఉన్నార‌ని ఇదే సరైన సమయం..పోయిన పగ్గాలు తీసుకోండి అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు సల‌హా ఇచ్చారు. రెండో రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ స‌భ్యుల అల్ల‌రి, ఎమ్మెల్యే బాల‌కృష్ణ విజిల్ ఊద‌డం ప‌ట్ల మంత్రి అంబ‌టి రాంబాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.  టీడీపీ సభ్యులకు కౌంటర్‌గా సభలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..  గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్ గా ఉన్నాడు.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు.. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ.. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు.. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి.. జన్మనిచ్చిన తండ్రి, క్లిస్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చిందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com