చంద్రబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న ఆయన తనపై నమోదైన కేసు కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు.. దాన్ని కొట్టివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టులో బాబుకు గట్టి షాక్ తగిలినట్లయింది. కాసేపట్లో సీఐడీ కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.