ఒడిశాలో 'స్క్రబ్ టైఫస్' విజృంభిస్తోంది. తాజాగా శుక్రవారం మరో ఐదు కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి నమోదైన మొత్తం స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 211కి పెరిగింది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కేసులు పెరగడంపై ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది. దీనిని అరికట్టడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు, జిల్లా యంత్రాంగానికి పెను సవాల్‌గా మారింది. పైగా దీనికి వ్యాక్సిన్ లేకపోవడం కలవరానికి గురి చేస్తోంది.