నేడు, స్కిల్ డెవలప్మెంట్ జరిగిన అవకతవకలు, అవినీతి నిరూపణకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఏపీ అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. బాలకృష్ణ సర్టీఫైడ్ సైకో అని... మానసికస్థితి సరిగా లేదని సర్టిఫికెట్ ఉన్న ఒకేఒక్క నేత బాలకృష్ణ అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన జడ్జిని కూడా టీడీపీ వాళ్లు ట్రోల్ చేశారని మండిపడ్డారు. ఈ ఆర్డర్ చూస్తే అంతా చంద్రబాబే చేసినట్టు అర్ధం అవుతోందన్నారు. షెల్ కంపెనీల్లో 1, 2 లేయర్లు తెలిశాయని.. మిగిలిన లేయర్లు తెలియాలని చెప్పారు. పాత్రదారుల్ని అరెస్టు చేస్తే సూత్రదారులను అరెస్టు చెయ్యొద్దా అని ప్రశ్నించారు. ఖైదీలకు వర్కు ఫ్రంహోం ఎలా అడుగుతారని నిలదీశారు. అయిదేళ్లకు ఒక సారి మానసికస్థితిపై సర్టిఫికెట్ తీసుకోవాలంటున్నారని.. తాము అదే కోరుకుంటున్నామని కన్నబాబు విరుచుకుపడ్డారు.