టీడీపీ అధినేత, చంద్రబాబును ఎలాంటి విచారణ చేయకుండా జైల్లో వేశారని.. ఏ రాజ్యాంగంలో లేదని.. ఎలాంటి విచారణ చేపట్టలేదని.. చాలా అన్యాయమని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం జరిగితే కళ్లుమూసుకొని నిద్రపోయారా? అని ప్రశ్నించారు. చంద్రబాబును చాలా ఇబ్బంది పెడుతున్నారని.. ఇలా చేస్తే ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వం నడపలేరని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజారికపాలన కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. రేపు ప్రభుత్వం మారితే జగన్ నీ గతి ఏంటో తెలుసుకోవాలని సూచించారు. జగన్ చేస్తున్న పనులు చూసి ప్రజలకు అసహ్యం కలుగుతోందన్నారు. జగన్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.