చంద్రబాబు అరెస్టుపై పార్లమెంటులో గళమెత్తిన టీడీపీ ఎంపీలకు, టీడీపీ యువనేత నారా లోకేష్ అభినందనలు తెలిపారు. నేడు ఢిల్లీలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టుని పార్లమెంటులో చర్చకు తెచ్చి, దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు గట్టి పోరాటం చేశారని నారా లోకేశ్ అన్నారు. వైసీపీ ఎంపీల హేళనలు, మాటల దాడులని తట్టుకుని సమర్థవంతంగా తెలుగుదేశం వాణిని పార్లమెంటులో వినిపించారన్నారు. భవిష్యత్ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహంపై నారా లోకేశ్ చర్చించారు. సమావేశంలో ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.