నీట్ వ్యవహారంలో కేంద్రప్రభుత్వ కుట్ర బహిర్గత మైందని తమిళనాడు రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి ధ్వజమెత్తారు. ఆయన తన ట్విట్టర్‌లో, నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని డీఎంకే ప్రారంభరోజుల నుంచే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు. నీట్ రాసిన వారికి జీరో మార్కులొచ్చినా, వారు పీజీ కోర్సుల కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులని కేంద్రం ప్రకటించిందని, దీని ద్వారా కేంద్రం కుట్ర బయటపడిందని ఉదయనిధి తెలిపారు.