విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ముడసర్లోవ పార్కు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జివిఎంసి కమిషనర్ సిఎం సాయికాంత్‌వర్మ అధికారులను ఆదేశించారు. ఆయన క్లేత్రస్థాయి పర్యటనలో భాగంగా ముడసర్లోవ పార్కును శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముడసర్లోవ పార్కును సందర్శకుల కోసం ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa