వినాయక పూజలో పాల్గొని ఇంటికి వెళుతున్న వృద్ధురాలి మెడలో బంగారం గొలుసు తెంచుకుని ఓ వ్యక్తి పరారైనఘటన గోపాలపట్నంలో శనివారం వెలుగుచూసింది. జీవీఎంసీ 92వ వార్డు శ్రీరామనగర్ కు చెందిన శరగడం రాజేశ్వరి స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం ప్రత్యేక పూజలో పాల్గొని ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి ద్విచక్రవాహనంపై గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారం గొలుసును తెంచుకుని పరారైయ్యాడు.