రెండు రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే టీడీపీ చర్చ కోసం వచ్చిందా.. రచ్చ కోసం వచ్చిందా అనేది ప్రజలకు అర్థంమై ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి చేశాడన్నారు. నిన్న అసెంబ్లీలో తొడకొట్టిన బాలకృష్ణ స్కిల్ స్కాంపై చర్చించకుండా ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. మీసం తిప్పిన బాలకృష్ణకు స్కిల్ కేసుపై చర్చించే రోషం లేదా..? అని నిలదీశారు. మీ బావ చంద్రబాబు తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి బాలకృష్ణ మనస్సాక్షి ఒప్పుకోలేదా..? అని ప్రశ్నించారు.