జైలులో ఉండాల్సిన సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జనంలో ఉండాల్సిన నిజాయతీపరుడు, టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్నారని ట్వీట్ చేశారు. ‘జైలు మోహన్ కు బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్.. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి, రూ.42 వేల కోట్ల ప్రజాధనం దోచేశారు. జగన్ పై సీబీఐ, ఈడీ సహా 38 కేసులున్నాయి.’ అని లోకేశ్ ధ్వజమెత్తారు.