ఎప్పూడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు విషయంలో మరోసారి స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై కేంద్రకారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తప్పు చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. చంద్రబాబు లక్ష్యంగా ఆయన ఎప్పటికప్పుడు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా మరోసారి ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు కేసును తప్పుదోవ పట్టించి మరింత జటిలం చేసుకున్నారని పేర్కొన్నారు. ఏ నేరం చేయలేదని బుకాయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారని, కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు రిమాండు విధించిందన్న విషయాన్ని లెక్క చేయకుండా మెయింటెయినబుల్ కాని క్వాష్ పిటీషనుతో హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారన్నారు.