వైసీపీ ఎ:పీ రఘు రామ కృష్ణంరాజు తొలి నుంచి ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ పొంది పదేళ్లయిన సందర్భంగా రఘు రామ కృష్ణంరాజు సెటైర్లు సంధించారు. కేక్ కట్ చేసి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 23వ తేదీ మా పార్టీ వాళ్లు సంబరాలు చేసుకునే రోజు అని వ్యంగ్యం ప్రదర్శించారు. రూ.43 వేల కోట్ల అవినీతి కేసులో బెయిల్ పై రావడం, ఆ బెయిల్ ను విజయవంతంగా కొనసాగించడం జగన్ కే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. కోర్టుకు హాజరు కావాల్సిన పనిలేదని ఆర్డర్ తెచ్చుకున్నారని, ఇంత ఘనత వహించిన జగన్ కు శుభాకాంక్షలు అంటూ రఘురామ వ్యాఖ్యానించారు.