ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకొనేందుకు యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యుటిఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల ప్రారంభ ఉత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన రాష్ట్రవ్యాపిత బైక్ జాతా బద్వేల్ కు చేరుకున్న సందర్భంగా పట్టణంలో భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఓబుల్ రెడ్డి చే యుటిఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు.