పాణ్యం సామజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు అవస్థలు పడుతున్నారని శనివారం ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా సహాయక కార్యదర్శి ప్రతాప్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు నిత్యం వందల సంఖ్యలో ఆస్పత్రికి వస్తుంటారని, రహదారి సౌకర్యం కూడా సరిగా లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కలెక్టరేటు ముట్టడిస్తామని హెచ్చరించారు.