ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాల వివాహం నేడు ఉదయ్ పూర్లో జరగనుంది. సిటీలోని లీలా ప్యాలెస్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికాగా.. శనివారం నుంచే అతిథులు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. తాజాగా ఈ వివాహానికి హాజరయ్యేందుకు ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉదయం ఉదయ్ పూర్ చేరుకున్నారు.