స్కిల్ స్కాం కేసులో రెండో రోజు సీఐడీ విచారణ ప్రారంభమైంది. చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారుల బృందం ప్రశ్నలు సంధిస్తోంది. విచారణ ప్రారంభానికి ముందే చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, శనివారం 50 ప్రశ్నలు వేయగా, 30 శాతం విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది.