అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్యంలో నాయకుల స్వార్థ ప్రయోజనాలు పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వరల్డ్ బ్యాంక్ పాక్ ప్రతినిధి నజీ బాన్ హాస్పిన్ అన్నారు. కాగా, పాక్ లో 40 శాతం జనాభా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు.