ఏపీ మాజీ సీఎం చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్పై కోర్టు నిర్ణయం ఏమిటి? చంద్రబాబు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ విషయంలో చంద్రబాబుపై జారీ అయిన రెండు పీటీ వారెంట్లపైనా నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.