యాపిల్ కంపెనీ ప్రొడక్టులు వాడే వారికి కేంద్రం తాజాగా అలర్ట్ జారీ చేసింది. ఐఫోన్, ఐపాడ్, యాపిల్ వాచ్‌లలో సెక్యూరిటీ లోపాన్ని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థ 'సెర్ట్-ఇన్' గుర్తించింది. తద్వారా హ్యాకర్లు యాపిల్ గ్యాడ్జెట్లను హ్యాక్ చేసి, యూజర్ల సమాచారం తస్కరించే అవకాశం ఉందని పేర్కొంది. సెర్ట్-ఇన్ పేర్కొన్న సెక్యూరిటీ లోపాల దృష్ట్యా యాపిల్ సంస్థ త్వరలో కొత్త ఓఎస్ అప్డేట్ రిలీజ్ చేసే వీలుంది.