ప్రస్తుతం వైరల్ ఫీవర్‌లతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. దీనికి 'ఏడిస్ ఈజిప్టి' అనే దోమ కారణమని, ఆ దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటలు, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఈ దోమలు మనుషులను ఎక్కువగా కుడతాయి. ఈ దోమలు నల్లగా, కాళ్లపై మచ్చలు కలిగి ఉంటాయి. మోచేతులు, చీలమండల వద్ద ఎక్కువగా ఈ దోమలు కుడతాయి.