స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ మాజీ సీఎం చంద్రబాబను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు రెండు రోజు(ఆదివారం) పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన గురించి మీకు అధికారులు చెప్పారా? యూపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫిసర్ అపర్ణను మీరు తీసుకొచ్చారట కదా? తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఎలా వస్తాయి?' అని ప్రశ్నించినట్లు సమాచారం.