మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. కస్రవాడ సమీపంలో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.వారంతా భోపాల్లోని 'కార్యకర్త మహాకుంభ్'కు వెళ్తున్నారు. ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.