కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సెప్టెంబర్ 14 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కొత్తగా ఎటువంటి కేసులు నమోదు కాకపోవడంతో పాఠశాలలను తెరుస్తున్నట్లు స్థానిక అధికారులు తాజాగా ప్రకటించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.