ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తప్పుబట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా వీటి ఏర్పాటు సరికాదని పేర్కొంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన నివేదికల్ని కాగ్ సమర్పించింది. వికేంద్రీకరణ పాలన కోసమే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంది. స్వపరిపాలన సాధనకు ప్రజా ప్రతినిధులతో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.