స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన SLP నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసును చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా నిన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అయితే దీన్ని మంగళవారం మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలని సీజేఐ సూచించారు. దీంతో ఇవాళ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.