గుత్తి మండలంలోని బెతాపల్లి గ్రామ సమీపంలోని పెద్దవంక మీద వంతెన నిర్మాణానికి సోమవారం ఎంపిపి జి. లక్ష్మీదేవి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు వంతెన సమస్యను ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి దృష్టికి తెచ్చారన్నారు. దీంతో ఆయన చొరవ తీసుకుని రూ. 40 లక్షలు మంజూరు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.