సీఎం జగన్ పాలనలో రాష్ట్రం నేడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, ప్రతి నిరుపేదకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు చెప్పారు. అసెంబ్లీలో వైద్యరంగంపై చర్చలో ఎమ్మెల్యే శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. మంచాన పడిన రోగులు ఆస్పత్రికి వెళ్లి ఉచితంగా చికిత్స పొంది క్షేమంగా ఇళ్లు చేరి.. వారి ఇంట్లో సీఎం వైయస్ జగన్ ఫొటో పెట్టుకొని ఆనందపడుతున్నారని, ఇలాంటి సంఘటనలు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లినప్పుడు కనిపించాయని చెప్పారు. 2014–19లో గత ప్రభుత్వం దాదాపు 23 లక్షల మంది కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందిస్తే.. వైయస్ జగన్ ప్రభుత్వం గడిచిన మూడున్నరేళ్లలో దాదాపు 48 లక్షల కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందించిందని చెప్పారు.