డిజిటల్ విద్యను పేదవారికి చేరువచేసిన నాయకులు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు. బుధవారం సభలో విద్యారంగంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే రోశయ్య మాట్లాడారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని, విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయన్నారు. విద్యారంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమన్నారు. విద్యారంగంపై సీఎం వైయస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. విద్యా విధానాల్లో మార్పుతోనే విద్యార్థులు హాజరు శాతం పెరిగిందన్నారు. గతంలో స్కూల్స్‌లో టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చేసిందని విమర్శించారు.