రూ.2 వేల నోట్ల మార్పిడికి ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి రూ.2 వేల నోట్లను ఈనెల 28న గురువారం నుంచి తీసుకోవద్దని బస్ కండక్టర్లకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ప్రస్తుతం చెలామణి ఉన్న రూ.2 వేల నోట్లు అక్టోబరు నుంచి చెల్లకపోనుండడంతో వాటిని మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.