పొన్నూరు మండలం నండూరు గ్రామం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పౌష్టికాహార మాసోత్సవ కార్యకమ్రం జరిగింది. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ అక్కినాగరాజు హాజరయ్యారు. ఆకు కూరలు, గుడ్లు, పాలు, పండ్లు ప్రతి రోజు క్రమం తప్పకుండ తీసుకొనడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చని సూచించారు. సూపర్ వైజర్ పద్మావతి మాట్లాడుతూ తల్లులకు బిడ్డ ఎదుగుదల గురించి వివరించారు. పౌష్టికాహార మాసోత్సవాల ప్రాధాన్యతపై తల్లులకు అవగాహన కల్పించారు.