రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా, సామాజికంగా అధిక ప్రాధాన్యత ఇస్తోందని మేయర్ కావటి శివ నాగ మనోహర్ తెలిపారు. గుంటూరు నగరంలోని మజ్లీస్ ఉలామా, జమైత్ ఉలామా ఆర్గనైజేషన్ సభ్యులు, ముస్లిం మత పెద్దలు బుధవారం మేయరును కలిశారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి వారికి ఖాళీ స్థలం కేటాయించడానికి నగర పాలక సంస్థ తరపున తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి లెటర్ రాస్తామన్నారు.