అక్టోబరు 21న ప్రత్యేక లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్టు నరసరావుపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ చైర్మన్ పీవీఎస్ సూర్య నారాయణమూర్తి బుధవారం తెలిపారు. అదాలత్ లో వివిధ రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్ లో ఉన్న కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు పరిష్కరిస్తారన్నారు. నరసరావుపేట 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఆవరణలో ఉదయం 10: 30 గంటల నుంచి సాయంత్రం వరకు అదాలత్ కొనసాగుతుందన్నారు.