డిఎస్సి-98 క్యాలిఫైడ్ అభ్యర్థులు 2, 326 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి కోరారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం విజయవాడ లోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం ముందు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మాల్యాద్రి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల చివరి రోజన్నా డిఎస్సి పై ప్రకటన చేయాలని కోరారు.